అసెంబ్లీలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే
ఎద్దేవా చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పడం అలవాటుగా మార్చుకుందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జోక్యం చేసుకున్న హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై.
ఈ సందర్బంగా సీఎం చేప్పది ఒకటి చేసేది మరోటి అంటూ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో 3 సార్లు రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని హరీశ్ రావు కామెంట్స్ చేశారు. తాను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఆరు గ్యారెంటీల పేరుతో బురిడీ కొట్టించారని, చివరకు పాలనా పరంగా చేతులెత్తేశారంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.
నేడు పోతిరెడ్డిపాడు నిర్మాణ బాధ్యత మనదేనన్నారు సీఎం. తెలంగాణ కోసం తాము రాజీనామా చేసిన 6 నెలల (19-12-2005) తర్వాత ఆ ప్రాజెక్ట్ కోసం జిఓ వచ్చింది (5-7-2005) అని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు అంగీకరించామని నిన్న సీఎం చెప్పారు. కానీ ఆయన “వ్యవసాయ మోటార్లు కాకుండా” అనే పద బంధాన్ని చదవడం మానేశాడని మండిపడ్డారు హరీశ్ రావు.
గత సెషన్లో రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక మేడిగడ్డకు నో చెప్పిందని సీఎం చెప్పారని అన్నారు. కానీ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా అవకాశం లేదని, అందుకే అన్నారం, సుందిళ్ల వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. మేడిగడ్డ సాధ్యం కాదని వారు అన లేదని గుర్తు చేశారు హరీశ్ రావు.