500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ బక్వాస్
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
ఢిల్లీ – లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సోమవారం పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా పేద, మధ్యతరగతి ప్రజలను పట్టించు కోలేదని వాపోయారు. ఇది కేవలం డబ్బున్న వాళ్లకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు, మోసం చేసే వ్యాపారస్తులకు మేలు చేకూర్చేలా ఉందని ఆరోపించారు. దీనికి బాధ్యత వహించాల్సింది మోడీ పరివారమేనని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
ఇక కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టు 500 కంపెనీలలో ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇదంతా బక్వాస్ అని, అతి పెద్ద మోసం అని సంచలన ఆరోపణలు చేశారు లోక్ సభలో విపక్ష నేత.
ఇదిలా ఉండగా 90 శాతం మంది దేశంలోని యువతీ యువకులకు ఈ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం ఉండదని, ఎలా శిక్షణ తో కూడిన భరోసా కల్పిస్తారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. నిరుద్యోగ నిర్మూలనకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్నారు . కానీ మోడీ నిద్ర పోతున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ లు ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. దాని గురించి చర్చించక పోవడం దారుణమన్నారు రాహుల్ గాంధీ.