నిర్మల అపహాస్యం రాహుల్ ఆగ్రహం
ఎస్సీ..ఎస్టీ..ఓబీసీ రిజర్వేషన్లపై కామెంట్
న్యూఢిల్లీ – పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలు, మధ్య తరగతి ప్రజలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లోక్ సభలో రాహుల్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ ప్రజలను పట్టించు కోలేదని అనడంతో ఒక్కసారిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వారిని అపహాస్యం చేసేలా ఫక్కున నవ్వారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ఎవరి వైపు ఉందనేది అర్థం అవుతోందంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి రాహుల్ బడ్జెట్ తయారు చేసిన వారిలో ఎంత మంది అధికారులు ఉన్నారో వివరాలతో సహా బయట పెట్టారు.
పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా బడ్జెట్ రూపొందించారని, ఇందులో 18 మంది డబ్బున్న వాళ్లకు మేలు చేకూర్చే అధికారులు ఉండగా ఒకరు ఎస్సీ, మరొకరు ఓబీసీకి చెందిన అధికారి మాత్రమే ఉన్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. దీన్ని బట్టే బడ్జెట్ ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తుందో అర్థం అవుతుందని మండిపడ్డారు.