NATIONALNEWS

మ‌ణిపూర్ లో మాన‌ని గాయం

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన రాహుల్

మ‌ణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో అంత‌ర్భాగ‌మైన మ‌ణిపూర్ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను కావాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. భార‌త్ జోడో న్యాయ్ యాత్ర సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కులం, మ‌తం ఆధారంగా రాజ‌కీయాలు చేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు రాహుల్ గాంధీ.

కేవ‌లం ఒక వ‌ర్గానికి మాత్ర‌మే ప్ర‌ధానమంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం బాధ క‌లిగిస్తోంద‌న్నారు. మ‌ణిపూర్ మండుతోంద‌ని , ఆ గాయం ఇంకా మాసి పోలేద‌ని అన్నారు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తున్న న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ మ‌ణిపూర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ప‌ర్య‌టించ లేద‌ని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ.