NEWSTELANGANA

వికారాబాద్..కృష్ణా రైల్వే లైన్ పై ఫోక‌స్

Share it with your family & friends

రూట్ మ్యాప్ వివ‌రించిన చీఫ్ ఇంజ‌నీర్
హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయ‌న ప్రాధాన్య‌త క్ర‌మంలో ఆయా శాఖ‌ల‌ను స‌మీక్షిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర అభివృద్దిపై దృష్టి సారించారు. ప్ర‌ధానంగా రోడ్లు, రైల్వే లైన్ల‌కు సంబంధించి ఫోక‌స్ పెట్టారు సీఎం.

ఇందులో భాగంగా ద‌క్షిణ తెలంగాణ‌లో మెరుగైన ర‌వాణా వ్య‌వ‌స్థ ఏర్పాటులో కీల‌క‌మైన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై దృష్టి సారించారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా త‌న‌ను క‌లిసిన చీఫ్ ఇంజ‌నీర్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ తో చ‌ర్చించారు. ప‌లు సూచ‌న‌లు చేశారు సీఎం.

శాస‌న స‌భ విరామంలో సీఎంను త‌న కార్యాల‌యంలో క‌లిశారు. వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్ర‌జెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.

‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ ప్రణాళికల్ని వడివడిగా పూర్తి చేసి, పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స‌మావేశంలో మ‌క్త‌ల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీ‌హ‌రి, వికారాబాద్ ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎమ్మెల్యే ప‌ర్ణికా రెడ్డి హాజ‌ర‌య్యారు.