కాళ్లు పట్టుకున్నారు ఒక్కటై పోయారు
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించారని, ఇప్పుడు గత్యంతరం లేక కేంద్రం వద్ద లోపాయికారి ఒప్పందం చేసుకున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం.
ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్దకు వెళ్లారని, వాళ్ల కాళ్లు పట్టుకున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారంటూ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీ సాక్షిగా గులాబీ దళాన్ని ఏకి పారేశారు. వ్యవస్థలను సర్వ నాశనం చేశారని, ఖాళీ ఖజానాను తమకు అప్పగించి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ శాఖను తడిమి చూసినా అంతా అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయని, ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ దోచు కోవడానికి, దాచు కునేందుకే ఎక్కువ సమయం తీసుకుందని పేర్కొన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.
మొత్తం మీద కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు, ముందస్తుగా అరెస్ట్ కాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో రహస్య ఒప్పందం చేసుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.