NEWSTELANGANA

లంచాల‌కు నిల‌యాలు ఠాణాలు

Share it with your family & friends

ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ

హైద‌రాబాద్ – ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశంలో నిప్పులు చెరిగారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని ఆవేద‌న చెందారు. స‌భ‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు తెలంగాణ పోలీసుల‌పై.

వారు డ్యూటీలు చేయ‌డం లేద‌ని, లంచాల‌కు అల‌వాటు ప‌డ్డారంటూ మండిప‌డ్డారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ. హైద‌రాబాద్ లోని అన్ని పోలీస్ స్టేష‌న్ ల‌కు లంచాలు వెళుతున్నాయ‌ని, ఇది బ‌హిరంగ ర‌హస్య‌మేనంటూ ఆరోపించారు.

అస‌లు సీఎం ఏం చేస్తున్నార‌ని, హోం శాఖ ఆయ‌న ప‌రిధిలోనే ఉంద‌ని దీనిపై విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. పోలీసుల లంచాల‌కు సంబంధించి ఒక ఏసీపీ త‌న‌కు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేష‌న్ నిర్మాణానికి డ‌బ్బులు సాయం చేయ‌మ‌ని అడిగాడ‌ని ఆరోపించారు ఓవైసీ.

తాను ఎందుకు ఇవ్వాల‌ని తాను ఎదురు ప్ర‌శ్న వేశాన‌ని, మీకు లంచాలు వ‌స్తున్నాయ‌ని , వాటితో క‌ట్టాల‌ని చెప్పాన‌ని ఇలా ఉంది పోలీస్ వ్య‌వ‌స్థ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.