తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామికి టీటీడీ సారె
బహూకరించిన ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ అరుణాచలం, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను స్వామి వారికి అలంకరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన సుబ్రమణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. టీటీడీ 2006 నుండి ఆడి కృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, పారుపత్తేదార్ తులసి ప్రసాద్, వేద పరాయణదారులు ఉన్నారు.