NEWSANDHRA PRADESH

బీఎస్ఎన్ఎల్ ను గాడిలో పెడ‌తాం

Share it with your family & friends

కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్

అమ‌రావ‌తి – కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కు సంబంధించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు కార‌ణం మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక దీనిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. రిల‌య‌న్స్ జియోకు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.

ఇదే స‌మ‌యంలో జియో ఉచితంగా స్టార్ట్ చేసింది. సిమ్, డేటా ..దీంతో పెద్ద ఎత్తున జ‌నం ఎగ‌బ‌డ్డారు. జియోను తీసుకున్నారు. తీరా ఈ మ‌ధ్య‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది రిల‌యెన్స్. టారిఫ్ ధ‌ర‌లు భారీ ఎత్తున పెంచ‌డంతో వినియోగ‌దారులు గగ్గోలు పెడుతున్నారు.

బాయ్ కాట్ జియో ..స‌పోర్ట్ బీఎస్ఎన్ఎల్ అంటూ హోరెత్తిస్తున్నారు. దీనిపై స్పందించారు కేంద్ర మంత్రి. బీఎస్ఎన్ఎల్ ను 3వ ప్ర‌త్యామ్నాయంగా మారుస్తామ‌ని చెప్పారు. అత్యున్న‌త సేవ‌లు పేద‌ల‌కు అందించేందుకు , రేట్లు పెంచ‌కుడా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఉత్త‌మ సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. త్వ‌ర‌లోనే దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో 4జీ, 5జీ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.