సంజూ శాంసన్ కు ఛాన్స్ దక్కేనా
శ్రీలంకతో మూడో టి20 మ్యాచ్
శ్రీలంక – కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ కు ఈసారైనా ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న అనుమానం నెలకొంది. గత్యంతరం లేక జట్టులో ఎంపిక చేయడం, తిరిగి అవకాశాలు ఇవ్వక పోవడం గత కొంత కాలం నుంచీ కొనసాగుతూ వస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం భారత జట్టు టి20 సీరీస్ తో పాటు వన్డే సీరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇప్పటికే టి20 సీరీస్ లో భాగంగా 2 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండింటి లోనూ టీమిండియా గెలుపొందింది.
ఈ రెండు మ్యాచ్ లలో ఇప్పటికే జట్టులో ఎంపికైన సంజూ శాంసన్ కు అవకాశం ఇవ్వలేదు. తాజాగా టి20 మ్యాచ్ ఆఖరు మ్యాచ్ జూలై 30న మంగళవారం జరగనుంది. బీసీసీఐ కావాలని సంజూ శాంసన్ ను పట్టించు కోవడం లేదని, కావాలనే పక్కన పెడుతోందని, ముంబై లాబీయింగ్ తొక్కి పెడుతోందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇవాల్టి మ్యాచ్ కైనా సంజూ శాంసన్ కు ఛాన్స్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గా నియమితులైన గౌతం గంభీర్ ఐపీఎల్ సందర్బంగా సంజూను గొప్ప క్రికెటర్ అంటూ పొగిడాడు. కానీ ఎంపిక వరకు వచ్చే సరికి పక్కన పెట్టడంపై మండి పడుతున్నారు.