DEVOTIONAL

ఘ‌నంగా ఆడికృత్తిక ప‌ర్వ‌దినం

Share it with your family & friends

శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో నిర్వ‌హ‌ణ

తిరుప‌తి – తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తిక పర్వ దినం అంగ రంగ వైభ‌వోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు తిరు వీధి ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి వారి ఆల‌యంలో నిర్వ‌హించిన ఆడి కృత్తిక ఉత్స‌వ కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఘ‌నంగా ఏర్పాట్లు చేసింది. వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించింది.