హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతం
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటన
ఇరాన్ – హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ లో బుధవారం తెల్ల వారుజామున హతమయ్యారు. దీనిని ధృవీకరించింది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సంస్థ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఘటనకు గల కారణాలను తెలుసు కునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. ఇరాన్ లోని టెహ్రాన్ లోని ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు పేర్కొంది ఐఆర్జీసీ. ఇదిలా ఉండగా హమాస్ చీఫ్ తో పాటు ఆయన దగ్గర ఉన్న అంగరక్షకులలో ఒకరు మరణించినట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించినట్లు ఐఆర్టీసీ ప్రజా సంబంధాల శాఖ వెల్లడించింది. ఆయనను జియోనిస్ట్ సంస్థ చంపిందని అనుమానం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హనీహ్ హాజరయ్యారు.
కాగా ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఎవరు చేశారు..దేని కోసం దాడికి పాల్పడ్డారనేది విచారణ తర్వాత తేలుతుందని, త్వరలోనే వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. హమాస్ చీఫ్ మృతితో ఇరాన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది సర్కార్.
.