ENTERTAINMENT

సెక్స్ ఎడ్యూకేష‌న్ పిల్ల‌ల‌కు అవ‌స‌రం

Share it with your family & friends

ప్ర‌ముఖ న‌టి సుస్మితా సేన్ కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ విశ్వ సుంద‌రి, ప్ర‌ముఖ న‌టి సుస్మితా సేన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సెక్స్ ఎడ్యూకేష‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా చిన్న త‌నం నుంచే శృంగార విద్య గురించి నేర్పించాల‌ని స్ప‌ష్టం చేశారు.

చిన్నతనం నుంచే పిల్లల్లో అవగాహన పెంచడం వ‌ల్ల అన‌ర్థాలు చోటు చేసుకునేందుకు వీలు ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సెక్స్ ఎడ్యూకేష‌న్ పై తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడింది. నేటి సమాజంలో లైంగిక అంశాల గురించి మాట్లాడితే.. దాన్ని తప్పుగా భావిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

1990ల్లో త‌న‌తో పాటు మా అమ్మ‌, పిల్ల‌లు క‌లిసి శృంగారం గురించి మాట్లాడుకుంటామ‌ని ఇందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు సుస్మితా సేన్. అప్పుడు నాకు 14-15 సంవత్సరాలు అనుకుంటా. ఏదైనా ఉంటే..నేను మా అమ్మను నిర్మొహమాటంగా అడిగేదానిన‌ని స్ప‌ష్టం చేశారు.

తను కూడా అంతే విపులంగా ఆన్సర్ ఇచ్చేంది. అందుకే సెక్స్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడేటప్పుడు తాను సిగ్గు ప‌డ‌నంటూ పేర్కొన్నారు. నా కూతుళ్ల‌కు ఆ విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ప్రతి ఒక్కరికీ సెక్స్ విషయంలో భావాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని, అందులో తప్పేం లేదని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే కొందరు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు.