సిరాజ్..జరీన్ కు గ్రూప్ -1 పోస్టులు
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి తమ ప్రతిభా పాటవాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చిన ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ , నిఖత్ జరీన్ లకు గ్రూప్ -1 పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరి గురించి పట్టించు కోలేదని ఆరోపించారు.
క్రీడా పరంగా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం. 143 కోట్ల మంది భారతీయులు ఉంటే కేవలం కొంత మంది క్రీడాకారులు మాత్రమే వెలుగులోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న దేశాలు పెద్ద ఎత్తున అథ్లెట్లు పంపిస్తున్నారని దీని వెనుక వారి కృషిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఇందులో భాగంగా క్రీడా పరంగా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కేటీఆర్ ను ఏకి పారేశారు.