మోసం సబితా ఇంద్రా రెడ్డి నైజం
పార్టీని మోసం చేసిన చరిత్ర ఆమెది
హైదరాబాద్ – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం శాసన సభలో ఆయన ప్రసంగించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారని, కానీ కేవలం పవర్ కోసం పార్టీ మారారంటూ మండిపడ్డారు.
పార్టీ కష్ట కాలంలో ఉండకుండా జంప్ జిలానీ లాగా వెళ్లి పోయిందంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు.
ఈ సమయంలో తనకు మద్దతు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క. తమ స్వలాభం కోసం పార్టీ మారిని మోసం చేసిన ఆమెకు సభలో మాట్లాడే హక్కు లేదన్నారు. ఆమె గురించి, చరిత్ర గురించి ప్రజలకు తెలుసన్నారు.
ఇలాంటి వాళ్లు చరిత్రలో నిలవరని తెలుసుకుంటే మంచిదన్నారు. కష్ట కాలంలో ఆదుకుని, అందలం ఎక్కించి , గౌరవం, గుర్తింపు ఇస్తే ఇలాగేనా మోసం చేసిది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క.