కొత్త గవర్నర్ కు సీఎం స్వాగతం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో
హైదరాబాద్ – తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన త్రిపురకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా శాసన సభ సమావేశాలలో పాల్గొన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి హుటా హుటిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.
నూతన గవర్నర్ కు స్వాగతం పలికారు. పుష్ప గుచ్ఛం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ , త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్మార వేణుగోపాల్ రావు ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర సర్కార్. ప్రధాని మోడీ కేబినెట్ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి ఇన్ చార్జ్ గా ఉన్న కేఎస్ రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణు దేవ్ వర్మను నియమించింది.
ఇదిలా ఉండగా ఇక్కడ ఇన్ చార్జ్ గా ఉన్న తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కు పూర్తి స్థాయి గవర్నర్ పదవిని మహారాష్ట్రకు కట్టబెట్టారు ప్రధానమంత్రి మోడీ. మొత్తంగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి వెల్ కమ్ తెలిపారు.