పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం
యూపీఎస్సీ సంచలన ప్రకటన
ఢిల్లీ – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) బుధవారం కీలక ప్రకటన చేసింది. తప్పుడు సర్టిఫికెట్ తో పరీక్షలు రాయడమే కాకుండా ట్రైనీ ఐఏఎస్ గా ఎంపికైన ముంబైకి చెందిన పూజా ఖేడ్కర్ కు సంబంధించి ఇవాళ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే యూపీఎస్సీ ఎంపికపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విపక్షాలు సైతం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ వచ్చాక పరీక్షల నిర్వహణలో లోటు పాట్లు తలెత్తడం, స్కాంలు జరగడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఇదిలా ఉండగా తాజాగా వికలాంగుల కోటాలో పూజా ఖేడ్కర్ పరీక్షలు రాయడం, ఐఏఎస్ కోసం ఎంపిక కావడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసినా మోడీ సర్కార్ పట్టించు కోలేదు.
చివరకు ప్రధానికి అత్యంత ఆప్తుడైన యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న సోనీ ఇంకా ఐదేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి సుదాన్ ను ఎంపిక చేసింది సర్కార్.
ఇదిలా ఉండగా ప్రీతి ఖేద్కర్ పై నిషేధం విధిస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఆమె భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమెపై కేసు నమోదైంది.