గంజాయి నిర్మూనలలో ఏపీ పోలీస్ భేష్
ప్రశంసలు కురిపించిన మంత్రి అనిత
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. బుధవారం అనిత ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గంజాయి నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు వంగలపూడి అనిత.
ఈ సందర్బంగా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా యాంటో నార్కోటిక్ సెల్ , లా అండ్ ఆర్డర్ టీమ్ లను ప్రశంసించారు. గంజాయి కేసులలో మరో 17 మంది నిందితులను పట్టుకోవడం బాగుందన్నారు. ఇదిలా ఉండగా నిందితుల వద్ద నుంచి పోలీసులు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి.
వంద రోజుల యాక్షన్ ప్లాన్ తో తమ సర్కార్ ముందుకు వెళుతోందని పేర్కొన్నారు . ఇదే సమయంలో రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని, అంత వరకు నిద్రపోయే పరిస్థితి లేదన్నారు వంగలపూడి అనిత.