NEWSTELANGANA

సీఎం కామెంట్స్ తో స‌బిత కంట‌త‌డి

Share it with your family & friends

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

హైద‌రాబాద్ – శాస‌న స‌భ‌లో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఉద్దేశించి. ఆమెను న‌మ్ముకుంటే బ‌తుకు జూబ్లీ హిల్స్ బ‌స్టాండేనంటూ సెటైర్ వేశారు. త‌న‌కు స‌పోర్ట్ చేయ‌లేద‌ని ఆరోపించారు. తాను అన్న‌దాంట్లో త‌ప్పేముంద‌ని అన్నారు రేవంత్ రెడ్డి.

ఈ సంద‌ర్బంగా తీవ్రంగా స్పందించారు స‌బితా ఇంద్రా రెడ్డి. మ‌హిళ‌లంటే గౌర‌వం లేకుండా పోయింద‌న్నారు. త‌న‌ను గెలిపించింది ఇందు కోస‌మేనా ఎన్నుకున్న‌ది అంటూ ప్ర‌శ్నించారు. త‌న‌నే కాదు రాష్ట్రంలోని మొత్తం మ‌హిళ‌ల‌ను అవమానించిన‌ట్టేన‌ని అన్నారు.

మ‌హిళ‌న‌ని చూడ‌కుండా అవ‌మానించారంటూ వాపోయారు. స‌బితా ఇంద్రా రెడ్డి చివ‌ర‌కు కంట‌త‌డి పెట్టారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు . బేష‌ర‌తుగా సీఎం రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉండ‌గా స్పందించిన రేవంత్ రెడ్డి తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి త‌ప్పు లేదంటూ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. క్షమాప‌ణ చెప్పే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం.