ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పండుగ
పంపిణీకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆరు హామీలను ఇచ్చింది. వృద్దులు, వితంతువులు, అనాధలకు గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇందులో భాగంగా ఊహించని రీతిలో జగన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఏకంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమికి అత్యధికంగా సీట్లు కట్టబెట్టారు. ఆడబిడ్డలు గంప గుత్తగా జై కొట్టారు. దీంతో 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమికి 164 సీట్లు వచ్చాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.
ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. పెన్షన్ల పంపిణీ పథకానికి దివంగత ముఖ్యమంత్రి , టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఆగస్టు 1 గురువారం ఉదయం 6 గంటలకే సీఎం నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
అనంతపురం జిల్లా మడకశిరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 64.82 లక్షల మందికి రూ. 2,737.1 కోట్లు పంపిణీ చేస్తున్నారు.