ENTERTAINMENT

ఆరోప‌ణ‌లు అబ‌ద్దం పెళ్లంటే భ‌యం

Share it with your family & friends

హీరో రాజ్ త‌రుణ్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సినీ న‌టుడు రాజ్ త‌రుణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నా సామి రంగా సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో త‌న ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్న లావణ్య వ్య‌వ‌హారంపై స్పందించారు.

లావ‌ణ్య చేస్తున్న ఆరోప‌ణ‌ల‌లో వాస్త‌వం లేద‌ని, త‌న‌ను డ్యామేజ్ చేసేందుకే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాజ్ త‌రుణ్. ఆమె వ్య‌వ‌హారానికి సంబంధించి తాను న్యాయ ప‌రంగానే తాను వెళ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.

మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. లావ‌ణ్య‌కు వ్య‌తిరేకంగా వెళ్ల‌డం లేద‌న్నారు. లీగ‌ల్ గానే ఎదుర్కొంటాన‌ని చెప్పారు రాజ్ త‌రుణ్. విష‌యం బ‌య‌ట‌కు రాగానే తాను దాక్కునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని అన్నారు. త‌న వైపు ఎలాంటి త‌ప్పు లేద‌న్నారు.

పూర్తిగా క్లారిటీతో ఉన్నాన‌ని, నా ద‌గ్గ‌ర ఆమె చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని నిరూపించేందుకు త‌గిన‌న్ని ఆధారాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు రాజ్ త‌రుణ్. ఇక సినిమాలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రితో సంబంధం అంట‌గ‌ట్ట‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మిగ‌తా రంగాలు వేరు సినిమా రంగం వేరు అని పేర్కొన్నారు.