బాబుతో యుఎస్ కౌన్సిల్ జనరల్ భేటీ
ఏపీ సీఎం ముందు చూపు కలిగిన నాయకుడు
అమరావతి – అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ మర్యాద పూర్వకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారిద్దరు ప్రధాన అంశాలపై గంటకు పైగా చర్చించారు. ఏపీ, అమెరికా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, విద్యా పరంగా ఎనలేని బంధం ఉందని ఈ సందర్బంగా తెలిపారు కౌన్సిల్ జనరల్ లార్సెన్.
ఏపీ సీఎం బాబును కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్న దార్శనికతను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు లార్సెన్ తెలిపారు. ప్రధానంగా యుఎస్ఏ , ఏపీ ప్రాంతాల మధ్య విడదీయ లేని బంధం ఉందని స్పష్టం చేశారు . వాణిజ్యం, సాంకేతికత, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నారు.
ముఖ్యమైన రంగాలలో కలిసి పని చేయడం కొనసాగించాలని తనతో చెప్పారని, తాను ఇందుకు మనస్పూర్తిగా ఓకే చెప్పానని తెలిపారు జెన్నిఫర్ లార్సెన్ . అంతకు ముందు ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రితో జరిగిన సమావేశం సక్సెస్ అయ్యిందని తెలిపారు.