కేరళ విషాదం పుతిన్ సంతాపం
లేఖ రాసిన రష్యా దేశ అధ్యక్షుడు
రష్యా – రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత దేశంలోని కేరళ రాష్ట్రంలోని వయనాడు లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకృతి వైపరీత్యం కారణంగా చోటు చేసుకున్న సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. కొండ చరియలు విరిగి పడడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఏకంగా 230 మందికి పైగా చని పోయారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రమాదం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్.
ఈ సందర్బంగా ఆయన సుదీర్ఘ లేఖ రాశారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి. కొండ చరియలు విరిగి పడిన ఘటన తనను బాధకు గురి చేసిందని తెలిపారు. చని పోయిన ప్రతి ఒక్కరికీ తన ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు వ్లాదిమిర్ పుతిన్.
తమ దేశం తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము సిద్దంగా ఉన్నామని ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు.