చంద్రబాబుతో యుఏఈ రాయబారి భేటీ
కీలక అంశాలపై చర్చించిన జమాల్ అల్షాలీ
అమరావతి – భారత దేశంలోని యూఏఈ రాయబారి డాక్టర్ అబ్దుల్నాసర్ జమాల్ అల్షాలీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు . ఈ సందర్బంగా సీఎం సదరు అంబాసిడర్ కు ఘణంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో గత కొన్నేళ్లుగా సత్ సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక , తదితర రంగాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ అబ్దుల్నాసర్ జమాల్ అల్షాలీ సుదీర్ఘంగా చర్చించారు.
వీరిద్దరి మధ్య దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన చర్చలు అర్థవంతంగా ముగిశాయని తెలిపారు. ఆయనను కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు.
భవిష్యత్తులో ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు డాక్టర్ అబ్దుల్నాసర్ జమాల్ అల్షాలీ. ఇదిలా ఉండగా యూఏఈ రాయబారితో జరిగిన చర్చలు ఏపీకి మరింత దోహదకారిగా ఉంటాయని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.