NEWSTELANGANA

సుప్రీంకోర్టు తీర్పు అభినంద‌నీయం

Share it with your family & friends

అసెంబ్లీలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించి సీజేఐ చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలో సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. వ‌ర్గీక‌ర‌ణ స‌బ‌బేన‌ని చెప్పిన తీరు ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

గురువారం ఆయ‌న శాస‌న స‌భా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు సీఎం. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉప కులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.

సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని సీఎం తెలిపారు.

ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి తో పాటు మంత్రి దామోద‌ర న‌ర‌సింహ సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వ‌చ్చేలా కృషి చేశార‌ని అన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.