చంద్రబాబు వల్లనే సాధ్యమైంది
ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ
న్యూఢిల్లీ – ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సబబే అని సంచలన తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. మాదిగలు కూడా మనుషులేనని , వారికి సమానమైన అవకాశాలు కల్పించాలని కోరుతూ అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తూ వచ్చారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) చీఫ్ మందకృష్ణ మాదిగ .
ఇవాళ కీలకమైన తీర్పు వెలువరించినందుకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో 2020లో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీసుకు వచ్చారని గుర్తు చేశారు.
ఇదంతా ఏపీ సీఎం వల్లనే సాధ్యమైందని, అంతే కాకుండా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పటేల్ తో పాటు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు , ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు మందకృష్ణ మాదిగ.
ఇదే సమయంలో మాదిగ ఉద్యమంలో అసువులు బాసిన వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నానని ప్రకటించారు.