ఎస్సీ వర్గీకరణ తెచ్చిందే నేను
ఇవాళ సబబేనని సుప్రీం చెప్పింది
కర్నూలు జిల్లా – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఇవాళ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం సబబేనని తీర్పు వెలువరించింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని , ఇదే తమ సిద్దాంతమని చెప్పారు .
ఆనాడు కమిటీ వసి ఎస్సీ వర్గీకరణ తీసుకు వచ్ఆచమని గుర్తు చేశారు. ఇవాళ తాను తీసుకున్న ఆ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎంఆర్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగను అభినందిస్తున్నట్లు తెలిపారు.
దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలి అనేదే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం. నాడు కమిటీ వేసి ఎస్సీ వర్గీకరణ తెచ్చాం. నేడు సుప్రీం కోర్టు దాన్ని ధృవీకరించింది. ప్రతి కులానికి, ప్రతి వర్గానికీ న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం.