త‌లుపుల‌మ్మ త‌ల్లిని ద‌ర్శించుకున్న అనిత

Share it with your family & friends

రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండేలా చూడాల‌ని కోరా

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తూర్పు గోదావ‌రి జిల్లాలో అత్యంత పేరు పొందిన శ్రీ త‌లుపుల‌మ్మ త‌ల్లి దేవాల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. అమ్మ వారికి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా అమ్మ వారి ఆల‌య పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

త‌లుపుల‌మ్మ త‌ల్లి అమ్మ వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో, అష్టైశ్వ‌ర్యాల‌తో ఉండేలా చూడు త‌ల్లి అని ప్రార్థ‌న చేసిన‌ట్లు చెప్పారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు కంట్రోల్ లో ఉన్నాయ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాల‌యాల‌ను పూర్వ వైభ‌వంలోకి తీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. డైన‌మిక్ లీడ‌ర్ గా పేరు పొందిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఏపీ అన్ని రంగాల‌లో ముందంజ‌లోకి వెళుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో ప్ర‌భుత్వం ఆల‌యాల గురించి ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తిరుమ‌ల‌లో ఎవ‌రైనా స‌రే రాజ‌కీయాలు , ఇత‌ర విష‌యాల గురించి మాట్లాడ కూడ‌ద‌ని సీఎం ఆదేశాలు జారీ చేశార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం తిరుమ‌లలో భ‌క్తుల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు.