రాయలసీమను సస్య శ్యామలం చేస్తా
కరువు అనే మాట వినపడకూడదు
కర్నూలు జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీశైలంలో కొలువు తీరిన మల్లికార్జున, భ్రమరాంబికా దేవిలను దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ కమిటీ , పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కు భారీ ఎత్తున నీటి వరద వచ్చింది.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ సందర్బంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాయమల సీమ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తానని ప్రకటించారు. ఒకనాడు రతణాలు వెల్లి విరిసేవని , కానీ అద్భుతమైన ఈ నేలను భ్రష్టు పాలు చేశారంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం.
ఈ ప్రాంతంలోని రైతులకు నిరంతరం నీళ్లు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో మిగిలి పోయిన ప్రాజెక్టులను పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖా ముఖి నిర్వహించారు.