NEWSINTERNATIONAL

హ‌మాస్ చీఫ్ కు క‌న్నీటి వీడ్కోలు

Share it with your family & friends

జ‌న సంద్రంతో నిండి పోయిన టెహ‌రాన్

ఇరాన్ – ఇజ్రాయెల్ దాడుల్లో హ‌త‌మైన హ‌మాస్ చీఫ్ ఇస్మాయెల్ అంతిమ యాత్ర‌లో వేలాది మంది జ‌నం పాల్గొన్నారు. త‌మ ప్రియత‌మ నాయ‌కుడికి అంతిమ వీడ్కోలు ప‌లికారు. ఇస్మాయెల్ అమ‌ర్ ర‌హే అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇరాన్ రాజ‌ధాని మొత్తం జ‌న సంద్రంతో నిండి పోయింది . హ‌మాస్ చీఫ్ వ‌ర్ధిల్లాలి అంటూ దారి పొడ‌వునా పూలు చ‌ల్లారు.

ఇదిలా ఉండ‌గా ఇరాన్ దేశానికి హ‌మాస్ చీఫ్ గుండె కాయ లాగా ఉంటూ వ‌చ్చారు. ఇజ్రాయెల్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌మాస్ సంస్థను అత్యున్న‌త‌మైన శ‌క్తివంత‌మైన సంస్థ‌గా తీర్చి దిద్దారు ఇస్మాయెల్.

ఇదే స‌మ‌యంలో త‌ను ఉన్నంత వ‌ర‌కు ఇరాన్ ను ఏమీ చేయ‌లేమ‌ని గుర్తించింది ఇజ్రాయెల్. బ‌తికి ఉంటే త‌మ‌కే ప్ర‌మాదమ‌ని గ్ర‌హించింది. ఆ దేశ అధ్య‌క్షుడు ఊహించ‌ని రీతిలో దెబ్బ కొట్టాడు. త‌న నివాసంలో ఉన్న స‌మ‌యంలో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దాడుల‌కు ప్రోత్స‌హించాడు.

ఈ ఆక‌స్మిక దాడుల‌తో ఇరాన్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఇదే స‌మ‌యంలో ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఇస్మాయెల్ తో పాటు అంగ‌ర‌క్ష‌కులు కూడా అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ దేశ అధ్య‌క్షుడు అలీ ఖ‌మేనీ ప్ర‌త్య‌క్ష దాడులు చేప‌ట్టాల‌ని ఆర్మీని ఆదేశించారు.