త్వరలో క్రీడా పాలసీ తీసుకొస్తాం – సీఎం
అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శాసన సభలో శుక్రవారం సీఎం ప్రసంగించారు. త్వరలో క్రీడా పాలసీని తీసుకు వస్తామని చెప్పారు. దేశంలో అత్యుత్తమమైన క్రీడా పాలసీ కేవలం హర్యానా రాష్ట్రంలో ఉందని అన్నారు.
అక్కడ ఎలాంటి విద్యార్హత లేకున్నా తమ తమ రంగాలలో క్రీడా విభాగాలలో అద్భుతమైన ప్రతిభా పాటవాలతో ప్రదర్శిస్తూ పతకాలను సాధించే క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నారంటూ తెలిపారు ఎనుముల రేవంత్ రెడ్డి.
అవార్డులు సాధిస్తే ఆటోమేటిక్ గా సాయం అందేలా పాలసీ తయారు చేస్తామని చెప్పారు. పంజాబ్ తరహాలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడా పరంగా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు సీఎం.
స్పోర్ట్స్ స్టేడియాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. భూమి అందుబాటులో ఉంటే తమ ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రేవంత్ రెడ్డి. నిధులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
నేషనల్ అకాడమీ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా బీసీసీఐతో కూడా మాట్లాడామని, ఇక్కడ స్టేడియం నిర్మించేందుకు ఓకే చెప్పారని స్పష్టం చేశారు సీఎం .