DEVOTIONAL

టీటీడీకి హైకోర్టు కీల‌క ఆదేశాలు

Share it with your family & friends

ర‌మ‌ణ దీక్షితులు చేసిన దావాపై

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) త‌న ప‌ట్ల అకార‌ణంగా కేసు వేసింద‌ని ఆరోపిస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు ర‌మ‌ణ దీక్షితులు. త‌న‌ను తిరిగి శ్రీ‌వారి ఆల‌యం ప్ర‌ధాన అర్చ‌కుడిగా కొన‌సాగించేలా ఆదేశాలు జారీ చేయాల‌ని పిటిష‌న్ లో కోరారు.

దీనికి సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఇదిలా ఉండ‌గా గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కుడి ప‌ద‌వి నుంచి ఏవీ ర‌మ‌ణ దీక్షితుల‌ను తొల‌గించింది. టీడీడీ ధర్మకర్తల మండలి, అధికారులు, సీనియర్, జూనియర్ పిఠాధిపతులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తద్వారా ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగిందని ఆరోపిస్తూ అప్ప‌టి ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి తొల‌గిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

దీంతో ఆయ‌న గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కుడి ప‌ద‌వి నుండి అకార‌ణంగా వైదొలిగారు. అయితే ఈ ఉత్తర్వులను రమణ దీక్షితులు సవాల్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా తనను కొనసాగించేలా టీటీడీని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనను పదవి నుంచి తొలగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.. సహజ న్యాయ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషనను విచారించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శితో పాటు టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.