NEWSANDHRA PRADESH

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి ఢోకా లేదు

Share it with your family & friends

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్

అమరావ‌తి – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు నూరైనా స‌రే , ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తామ‌ని స్ప‌ఫ్టం చేశారు. ఇందులో ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఆరోగ్య శ్రీ‌కి సంబంధించి గ‌త ప్ర‌భుత్వం బ‌కాయిల‌ను చెల్లించ‌ని కార‌ణంగా కొంత ఇబ్బందులు ఏర్ప‌డిన మాట వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకున్నారు. వాటిని క్లియ‌ర్ చేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు.

ఆరోగ్య శ్రీ ఎక్క‌డికీ పోద‌న్నారు. య‌ధా విధిగా కూట‌మి స‌ర్కార్ కొన‌సాగించి తీరుతుంద‌న్నారు. గ‌త 5 ఏళ్ల‌లో ప్రైవ‌ట్ ఆస్ప‌త్రుల‌కు 13 సార్లు నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపారు మంత్రి. త‌మ స‌ర్కార్ కొలువు తీరి కేవ‌లం 50 రోజులు మాత్ర‌మే అయ్యింద‌ని గుర్తు చేశారు.

అంత లోపే ఆరోగ్య శ్రీ‌ని నిలిపి వేస్తున్న‌ట్లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు స‌త్య కుమార్ యాద‌వ్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, అందులో ఆరోగ్య శాఖ కూడా ఒక‌టి అని ఆరోపించారు .