విశాల్ ఇది షూటింగ్ కాదు హైకోర్టు
హీరో కామెంట్స్ పై జడ్జి సీరియస్
తమిళనాడు – ప్రముఖ తమిళ సినీ హీరో విశాల్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనపై కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది సినిమా షూటింగ్ కాదు ..కోర్టు అన్న సంగతి గుర్తు పెట్టుకుని మాట్లాడాలంటూ న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఒక హీరో అయి ఉండి ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఫైర్ అయ్యారు.
శుక్రవారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ కేసును విచారణ చేపట్టింది హైకోర్టు. కేసు విచారణలో భాగంగా నటుడు విశాల్ హాజరయ్యారు. తెల్ల కాగితంపై మాత్రమే తాను సంతకం చేశానని, లైకా సంస్థతో ఒప్పందం చేసుకున్నానే విషయం తనకు తెలియదని బుకాయించారు కోర్టు ప్రాంగణంలో.
విశాల్ గుడ్డిగా తన వాదనను జడ్జి ముందు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. దీంతో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. తనతో తెలివిగా సమాధానం చెప్పానని అనుకుంటున్నావా అంటూ మండిపడ్డారు. కోర్టులో ఉన్నావనే సంగతి మరిచి పోయావా..అంత గర్వమా నీకు అంటూ నిప్పులు చెరిగారు జడ్జి.
సరిగ్గా సమాధానం చెప్పాలని లేక పోతే తీవ్రమైన చర్యలకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు నటుడు విశాల్ ను.