వల్లభనేని వంశీ అరెస్ట్
గన్నవరం వద్ద అదుపులోకి
విజయవాడ – గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం హైదరాబాద్ నుంచి గన్నవరంకు వెళుతుండగా వాహనాన్ని వెంబడించారు. గన్నవరంకు దగ్గరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా వల్లభనేని వంశీ కనిపించకుండా పోయారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ71గా చేర్చారు మాజీ ఎమ్మెల్యే వంశీని.
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఒక వెలుగు వెలిగారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత జగన్ రెడ్డి వైపు వెళ్లారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్ , ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చివరకు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడిన వారిని ఏ ఒక్కరినీ విడిచి పెట్టలేదు. అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఒకే ఒక్కడు వల్లభనేని వంశీ కనిపించకుండా పోయారు. చివరకు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ వంశీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు.
ఇవాళ హైదరాబాద్ నుంచి ఆయన వాహనాన్ని వెంబడించారు. ఈ కేసులో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.