దానం కామెంట్స్ బీఆర్ఎస్ సీరియస్
సీఎం కావాలనే తిట్టిస్తున్నారని ఫైర్
హైదరాబాద్ – శాసన సభ సాక్షిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నానా దుర్భాషలాడారు. అయినా స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ మౌనంగా ఉండటం విస్తు పోయేలా చేసింది. దానం వాడిన భాష అత్యంత జుగుస్సాకరంగా, అభ్యంతకరంగా, సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
ఈ సందర్బంగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు సభలో తమ పట్ల కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దానం నాగేందర్ తో తిట్టిస్తున్నాడని వాపోయారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలని చూడకుండా అవమానించారని ఆరోపించారు. దానం వాడిన భాష రౌడీ షీటర్ ను తలపించేలా ఉందని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ కాస్తా జోక్ క్యాలెండర్ గా మారి పోయిందన్నారు. దీనిపై చర్చ జరగకుండా సర్కార్ పారి పోయిందన్నారు కేటీఆర్, హరీశ్ రావు.