రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా భేటీ
స్కిల్ యూనివర్శిటీలో పెట్టుబడులు
హైదరాబాద్ – ప్రముఖ వ్యాపారవేత్త , మహీంద్రా గ్రూప్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, స్కిల్ యూనివర్శిటీకి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి.
జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి చేరుకున్న బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రాకు సాదర స్వాగతం పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనను ఘనంగా సన్మానించారు. నందిని బహూకరించారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు ఆనంద్ మహీంద్రా.
ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటో మోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు అంగీకరించారు. ఈ సందర్బంగా ఆనంద్ మహీంద్రాను ప్రత్యేకంగా అభినందలతో ముంచెత్తారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీమ్ ను పంపుతామని వెల్లడించారు ఆనంద్ మహీంద్రా.
హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణ కూడా చేపడతామని సీఎంకు హామీ ఇచ్చారు.