NEWSINTERNATIONAL

క‌మ‌లా హారీస్ పై నోరు పారేసుకున్న ట్రంప్

Share it with your family & friends

భార‌త జాతీయురాలా లేక న‌ల్ల జాతీయురాలా

అమెరికా – మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. శ‌నివారం ఆయ‌న డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ప్ర‌స్తుతం అధ్య‌క్ష స్థానానికి బ‌రిలో నిలిచిన , ప్ర‌స్తుత దేశ ఉపాధ్య‌క్షురాలైన క‌మ‌లా హారీస్ ప‌ట్ల తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న జాత్యాహంకార పూరిత కామెంట్స్ చేశారు.

క‌మ‌లా హారీస్ నిజ‌మైన భార‌తీయురాలా లేక న‌ల్ల జాతీయురాలా అని వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేలా మాట్లాడారు. ట్రంప్ చేసిన కామెంట్స్ పై ప‌లువురు అమెరిక‌న్ల‌తో పాటు ప్ర‌వాస భార‌తీయులు సైతం తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. అత్య‌ధికంగా ఇండియ‌న్లు అక్క‌డ నివ‌సిస్తున్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌వాస భార‌తీయులు, వ‌ల‌స వ‌చ్చిన వారి ఓట్లే కీల‌కం కానున్నాయి.

వ‌యో భారం రీత్యా తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోవ‌డం లేదంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్. అధ్య‌క్ష ఎన్నిక‌లు వ‌చ్చే న‌వంబ‌ర్ 5న జ‌ర‌గ‌నున్నాయి. ప్రెసిడెంట్ గా రెండోసారి బ‌రిలో ఉన్నారు ట్రంప్. దీంతో ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ట్రంప్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ మేర‌కు వ్యూహాత్మ‌కంగా క‌మ‌లా హారీస్ పై దాడి చేయ‌డం మొద‌లు పెట్టారు.