DEVOTIONAL

ముగిసిన కోదండ రాముడి ప‌విత్రోత్స‌వాలు

Share it with your family & friends

భారీ ఎత్తున హాజ‌రైన స్వామి వారి భ‌క్తులు

తిరుప‌తి – ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం తిరుప‌తి లోని శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

ముందుగా స్వామి వారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవ మూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్‌ సోమ శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.