బ్యాంకుల నిర్వాకం ఖాతాదారులకు శాపం
రూ. 8495 కోట్లు ఫైన్ వేశారన్న ఎంపీ
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు అనుసరిస్తున్న తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
విచిత్రం ఏమిటంటే గత 5 ఏళ్ల సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ బ్యాంకులలో ఖాతాలు కలిగిన ఉన్న ఖాతాదారులు మినిమం బ్యాలెన్స్ ఉంచక పోవడం వల్ల వారి నుంచి జరిమానా కింద ఏకంగా రూ. 8,495 కోట్లు వసూలు చేశాయని మండి పడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ఇది పూర్తిగా అన్యాయమని, ఒక రకంగా ఆర్థికపరమైన నేరంగా పరిగణించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ ఇది అన్యాయం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు ఎంపీ. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉన్న ప్రతి ఒక్కరిపై ఖాతాలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించాలని, ఇదే సమయంలో జరిమానాలు విధించకుండా చూడాలని విజయ సాయి రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విన్నవించారు.