చందనా జయరాంకు సీఎం కంగ్రాట్స్
టీడీపీ సీనియర్ కార్యకర్త కూతురు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన చందనా జయరాంను ప్రత్యేకంగా అభినందించారు. శనివారం తన కార్యాలయంలో ఆమెతో పాటు తండ్రిని పలకరించారు. ఆమెకు పుష్ప గుచ్చం ఇచ్చారు. వెన్ను తట్టి ప్రోత్సహించారు.
చందనా జయరాం హైదరాబాద్ లో నిర్వహించిన పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొన్నారు. ఈ పోటీలలో అందరినీ దాటుకుని అర్హత సాధించారు. అంతే కాకుండా ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొననున్నారు చందనా జయరాం.
ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎవరో కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఉయ్యాల జయరామ్ కూతురు కావడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అమ్మాయి అభిరుచిని ప్రోత్సహించినందుకు తండ్రికి కంగ్రాట్స్ తెలిపారు.
ఇదిలా ఉండగా ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ పోటీలలో విజేతగా నిలవాలని చందనా జయరాంను కోరారు.