హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు
ఎన్టీఆర్ పేరు పెట్టిన ఏపీ సర్కార్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మంత్రివర్గం ఆమోదం మేరకు గతంలో కొలువు తీరిన వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హెల్త్ యూనివర్శిటీ పేరును తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
తాజాగా జగన్ సర్కార్ కూలి పోయింది. కొత్తగా ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడింది. దీంతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దివంగత ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును తిరిగి హెల్త్ యూనివర్శిటీకి పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఏపీ సీఎం ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఏపీ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారనుంది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ , టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి , ఆయన పరివారం పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు .