NEWSNATIONAL

ఎస్పీ నేత మోయిద్ ఖాన్ పై క‌న్నెర్ర‌

Share it with your family & friends

ఇంటిని కూల్చేసేందుకు బోల్డోజ‌ర్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – సీఎం యోగి ఆదిత్యానాథ్ సీరియ‌స్ అయ్యారు. అయోధ్య‌లో 12 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. రాష్ట్రంలో అస‌లు లా అండ్ ఆర్డ‌ర్ ఉందా అన్న అనుమానం నెల‌కొంద‌ని విమ‌ర్శ‌లు త‌లెత్తాయి. దీనిపై స్పందించారు సీఎం యోగి. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా బాలికపై సామూహిక రేప్ ఘ‌ట‌న‌లో స‌మాజ్ వాది పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు మోయిద్ ఖాన్ ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆయ‌న‌ను ప్ర‌ధాన నిందితుడిగా చేర్చింది ఎఫ్ఐఆర్ లో.

విష‌యం గురించి సీఎం ఆరా తీశారు. వెంట‌నే రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఎక్క‌డ ఉన్నా త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. శ‌నివారం మోయిద్ ఖాన్ ఇంటి పైకి బుల్డోజ‌ర్ వెళ్లింది. వెంట‌నే కూల్చి వేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే యోగికి బుల్డోజ‌ర్ బాబా అన్న పేరుంది. రాష్ట్రంలో క‌రుగుగ‌ట్టిన నేర‌స్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేశాడు సీఎం. ఇప్పుడు మ‌రోసారి ఎస్పీ నేత గుండెల్లో గుబులు రేపేలా బుల్డోజ‌ర్ ను పంపించాడు యోగి.