మాదిగలు ఎవరికీ వ్యతిరేకం కాదు
మంత్రి దామోదర రాజ నరసింహ
హైదరాబాద్ – రాష్ట్రంలో మాదిగలు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కీలక తీర్పు వెలువరించిన సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
మాదిగలతో ప్రత్యేకంగా దామోదర రాజ నరసింహ సమావేశం నిర్వహించారు హైదరాబాద్ లో . అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్గీకరణపై ఇచ్చిన తీర్పు ఎందరికో బలాన్ని , శక్తిని ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా రాష్ట్రంలో అమలు చేసి తీరుతామన్నారు దామోదర రాజ నరసింహ.
మాదిగ జాతి సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ను పెట్టారని తెలిపారు. మాదిగలకు న్యాయం జరగాలని సూచించారని చెప్పారు. మాదిగల పట్ల కొంత దురభిప్రాయం ఉందని, కానీ అది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. మాదిగలు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అందరం సమానమేనని, కమిటీ వేసి ఆర్డినెన్స్ తీసుకు రావాలని తాము సీఎంను కోరుతామని చప్ఆపరు దామోదర రాజ నరసింహ.