ఏపీ సర్కార్ పై పేర్ని నాని ఫైర్
సంబంధం లేని వ్యక్తులపై కేసు
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైదాడి కేసులో గన్నవరం సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న 4గురు వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు మాజీ మంత్రి నాని, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్.
అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 2023 ఫిబ్రవరిలో వైసీపీ ఆఫీస్ పై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని, ఈ సమయంలో ఆత్మ రక్షణ కోసం దాడులు చేశారని ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
విచిత్రం ఏమిటంటే కావాలని కేసులకు సంబంధం లేని వ్యక్తులపై ఎలా కేసులు నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉంది కదా అని మొదట ఏడుగురిపై కేసు నమోదు చేశారని, ప్రస్తుతం వాటి సంఖ్యను 71కి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు పేర్ని నాని.
ఇందులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71ఏగా చేర్చారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఆదేశాల మేరకు పరామర్శించడం జరిగిందని చెప్పారు మాజీ మంత్రి.