మా నాన్న దమ్మున్న లీడర్ – ఇవాంకా
అమెరికా బాగు పడాలంటే ఎన్నుకోండి
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వయసు పెరిగిన కారణంగా తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు ప్రస్తుత దేశ అధ్యక్షుడిగా ఉన్న జోసెఫ్ బైడెన్. తన వారసురాలిగా భారతీయ సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇప్పటికే తాను రెండోసారి బరిలో ఉంటానని స్పష్టం చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఆయన మాటల తూటాలు పేల్చుతున్నారు. కమలా హారీస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయ సంతతికి చెందిన వారా లేక నల్ల జాతీయురాలా చెప్పాలంటూ డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ తన తండ్రి తరపున ప్రచారం చేస్తోంది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను కాపాడు కోవడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ను ఉద్దేశించి మండిపడ్డారు. తన తండ్రి దమ్మున్న లీడర్ అంటూ కొనియాడారు. ఆయనను ఢీకొనే సత్తా బైడెన్ కు, కమలా హారీస్ కు లేదని అన్నారు ఇవాంకా ట్రంప్.