అమెరికాలో సీఎంకు గ్రాండ్ వెల్ కమ్
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం టూర్
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్బంగా సీఎం తో పాటు ఆయన బృందానికి ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, ప్రవాస భారతీయులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు వెల్ కమ్ చెప్పారు.
యుఎస్ఏ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 13 వరకు ఉంటారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. వివిధ కంపెనీలు, తెలంగాణకు చెందిన వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో భేటీ కానున్నారు.
కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం పెట్టుబడి పెట్టేందుకు వచ్చే ఔత్సాహికులకు తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టాలని, ప్రపంచంతో పోటీ పడేలా ముచ్చర్ల ప్రాంతంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే టాప్ కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెషీన్ లెర్నింగ్ , రోబోటెక్ టెక్నాలజీ, తదితర వాటిపై తర్ఫీదు ఇచ్చి జాబ్స్ ఇస్తామన్నారు. ఇందులో ప్రవాస భారతీయులు ఇన్వెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.