NEWSNATIONAL

సీఎంకు షాక్ పారిస్ టూర్ కు నో ఛాన్స్

Share it with your family & friends

జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ క‌ల్పించ‌లేమ‌న్న కేంద్రం

పంజాబ్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. ఆయ‌న తాను ఫ్రాన్స్ వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆ దేశ రాజ‌ధాని పారిస్ లో ఒలింపిక్స్ జ‌రుగుతున్నాయి. త‌మ పంజాబ్ రాష్ట్రం త‌ర‌పు నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నార‌ని, వారిని ప‌రామ‌ర్శించి..భ‌రోసా క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, త‌ను వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించింది కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిత్వ శాఖ‌. ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని పేర్కొంది.

ప్ర‌స్తుతం భ‌గ‌వంత్ మాన్ కు జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని, ఇదే సెక్యూరిటీని ఫ్రాన్స్ టూర్ లో క‌ల్పించ‌డం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది మంత్రిత్వ శాఖ‌. ఈ మేర‌కు ఆయ‌న టూర్ కు అనుమ‌తి నిరాక‌రించ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా భ‌గ‌వంత్ మాన్ టూర్ క్యాన్సిల్ చేయ‌డం వెనుక ఎలాంటి రాజ‌కీయాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.