NEWSNATIONAL

కేంద్రం చేతుల్లోకి వ‌క్ఫ్ బోర్డు ప‌వ‌ర్స్

Share it with your family & friends

అడ్డుక‌ట్ట వేసేందుకు బిల్లుకు రెడీ

న్యూఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర్బంగా వ‌క్ఫ్ బోర్డుకు సంబంధించి వ్యాఖ్య‌లు చేశారు మోడీ.

మెల మెల్ల‌గా ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా కీల‌క‌మైన, అత్యంత విలువైన ఆస్తులు క‌లిగి ఉన్నాయి వ‌క్ఫ్ బోర్డులు. వీటి విలువ సుమారు వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

విచిత్రం ఏమిటంటే వీటిపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అధికారం ఉండ‌దు. ఎవ‌రికీ కేటాయించేందుకు గాను, బ‌దలాయించేందుకు కానీ, లేదా విక్ర‌యించేందుకు, నిర్మాణాలు చేప‌ట్టేందుకు అవ‌కాశమే లేకుండా పోయింది. మొత్తంగా వ‌క్ఫ్ బోర్డు పూర్తిగా మ‌త ప‌ర‌మైన సంస్థ‌ల‌కు కేరాఫ్ గా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వీట‌న్నంటిని గ‌మ‌నించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఉన్న వ‌క్ఫ్ బోర్డుల ప‌రిధిని, అధికారాల‌ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకు రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు పార్ల‌మెంట్ లో బిల్లు ప్ర‌వేశ పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ఆయ‌న తీసుకున్న ఈ డెసిష‌న్ సంచ‌ల‌నంగా మారింది.