కావ్య కళ్యాణ్ రామ్ కెవ్వు కేక
తాజా ఫోటోస్ నెట్టింట్లో వైరల్
హైదరాబాద్ – టాలీవుడ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. తాజాగా చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన హాట్ ఫోటోలను తను స్వంతంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకుంది. లైకులు..కామెంట్స్ తో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.
కావ్య వయసు ప్రస్తుతం 26 ఏళ్లు. తను తెలంగాణ ప్రాంతంలోని కొత్తగూడెం స్వస్థలం. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో చదువుకుంది. తన సినీ కెరీర్ బాల నటిగా ప్రారంభమైంది. స్నేహమంటే ఇదేరా అనే సినిమాతో ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గంగోత్రి, ఠాగూర్ , విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి చిత్రాలలో నటించింది.
2022లో మసూదా మూవీలో లీడ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమా భారత దేశ వ్యాప్తంగా ఆదరణ పొందింది. ఆ తర్వాత ఉస్తాద్ లో నటించింది.
ప్రస్తుతం మరికొన్ని చిత్రాలలో నటించనుంది కావ్య కళ్యాణ్ రామ్. తాజాగా చేసిన ఫోటో షూట్ మాత్రం కెవ్వు కేక అంటున్నారు ఫ్యాన్స్.